Vidaamuyarchi : తమిళ సినీ రంగానికి చెందిన స్టార్ హీరో అజిత్ , అందాల తార త్రిష కృష్ణన్ కలిసి నటించిన విదాముయార్చి సూపర్ హిట్ గా నిలిచింది. పలు ఓటీటీ సంస్థలు ఈ చిత్రాన్ని చేజిక్కించు కోవడానికి పోటీ పడ్డాయి. చివరకు నెట్ ఫ్లిక్స్ స్వంతం చేసుకుంది. ఈ మేరకు తాజాగా మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే మూవీకి సంబంధించి ఒప్పందం పూర్తయిందని, మార్చి 1న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు నెట్ ప్లిక్స్ తన అధికారిక ఎక్స్ ఖాతా హ్యాండిల్ లో వెల్లడించింది.
Vidaamuyarchi OTT Updates
ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరిలో విడుదలైంది. కథా పరంగా కొంచెం నిరాశ కలిగించినప్పటికీ అజిత్, త్రిషల కాంబినేషన్ కెవ్వు కేక అనిపించేలా చేసింది.
విదాముయార్చి(Vidaamuyarchi) చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ ఖర్చుతో నిర్మించింది. ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. మరో వైపు అజిత్ ఇంకో మూవీలో బిజీగా ఉన్నాడు. తను మరోసారి త్రిష కృష్ణన్ తో కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుందని ఇప్పటికే దర్శక, నిర్మాతలు ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఎలాంటి భేషజాలు లేకుండా తన పని తాను చేసుకుంటూ పోవడం అజిత్ ప్రత్యేకత. అందుకే ఆయన దేనిలోనూ తలదూర్చడు. కాంట్రవర్సీస్ కు దూరంగా ఉంటాడు. కీలకమైన పాత్రలను ఎంచుకుంటాడు.
Also Read : Hero Vicky Kaushal-Chhaava Telugu :మార్చి 7న ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్