Ajay Devgn: ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన తాజా సినిమా ‘మైదాన్’. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, దక్షిణాది అగ్రహీరోయిన ప్రియమణి ప్రధాన పాత్రలో అమిత్ శర్మ రూపొందించించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ డ్రీమ్ ప్రాజెక్టుగా విడుదలైన ఈ సినిమాలో ఫుట్ బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ దేవగణ్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించారు. ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ సంపాదించింది.
Ajay Devgn Movie Updates
ఈ నేపథ్యంలో ‘మైదాన్’తో మంచి విజయం సాధించిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్(Ajay Devgn)… ఇప్పుడు మరో స్పోర్ట్స్ స్టార్ బయోపిక్ కు సిద్ధమౌతున్నట్లు సమాచారం. భారతదేశ మొట్టమొదటి దళిత క్రికెటర్ పల్వంకర్ బాలూ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో అజయ్ దేవగణ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన ‘ఏ కార్నర్ ఆఫ్ ఏ ఫారెన్ ఫీల్డ్’ పుస్తకం ఆధారంగా… తిగ్మాన్షు ధూలియా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్మాత ప్రీతీ సిన్హా ఎక్స్ ద్వారా తెలిపింది. దళిత వర్గానికి చెందిన పల్వంకర్ పుణెలోని ఓ క్రికెట్ క్లబ్‌లో గ్రౌండ్స్‌మెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1896లో క్రీడా క్లబ్ హిందూ జింఖానా తరఫున క్రికెట్ ఆడేందుకు ఎంపికయ్యారు. అలా మొదలైన తన క్రికెట్ జీవిత ప్రయాణం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందో ఈ చిత్రంలో చూపించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Also Read : Aa Okkati Adakku: సైలంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’ !