Aishwarya Rajesh : తమిళ సినీ రంగానికి చెందిన నటి ఐశ్వర్య రాజేశ్ ఈ మధ్యన వైరల్ గా మారింది. తను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విక్టరీ వెంకటేశ్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో కీ రోల్ పోషించింది. ఈ మూవీ ఊహించని సక్సెస్ సాధించింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ వర్గాలను విస్మయ పరిచింది. ఇది పక్కన పెడితే ఫుల్ ఎంజాయ్ చేస్తోంది చిత్ర బృందం.
Aishwarya Rajesh Opnion on Love
వాలంటైన్స్ సందర్బంగా ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) తన మనసులోని మాటను వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా లవ్ అంటే చచ్చేంత ఇష్టమని, కానీ దానంతట నరకం ఇంకొకటి ఈ లోకంలో లేదని పేర్కొంది. ఆ సంబంధంలో తాను నరకం గుండా వెళ్లానని వాపోయింది.
లైఫ్ జర్నీలో దీనిని తట్టుకోలేనని , ఆ ఘటన నుంచి బయట పడేందుకు తాను ఎన్నో తిప్పలు పడ్డానని వాపోయింది ఐశ్వర్య రాజేశ్. తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంది. ప్రేమించడం ప్రేమలో పడటం చాలా సులభమని, కానీ అది సముద్రమంత లోతైనదని, దానిలోకి దూకాలని అనుకుంటామని కానీ వెళితే కానీ బయటకు రాలేమంటూ పేర్కొంది.
ఎంతో మందిని తన నటనతో నవ్వులు పూయించిన ఐశ్వర్య రాజేశ్ హృదయంలో ఇంతటి బాధ ఉందని ఎవరికీ అర్థం కాలేదు తను చెప్పే దాకా. మొత్తంగా తను చెప్పినట్లు ప్రేమ అద్భుతం..కానీ అదో అందమైన నరకం అంటూ పేర్కొంది.
Also Read : Beauty Janhvi Kapoor :జాక్ పాట్ కొట్టేసిన జాన్వీ కపూర్