బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి మెరిశారు. తనకు పెళ్లి అయినా సరే తనలో ఏ మాత్రం అందం తగ్గలేదని నిరూపించారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్నా ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో మెరిశారు. అద్భుతంగా నటించి మెప్పించారు.
తాజాగా వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారారు. ఇందుకు కారణం పారిస్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్. అంతే కాదు గాలిలో కూడా ముద్దు ఇచ్చి అందరినీ మెస్మరైజ్ చేశారు.
ప్రత్యేకించి తన డ్రెసెస్ సెలెక్షన్ విషయంలో తానే కేర్ తీసుకుంటారు. అందుకే ఆమె మరింత అందంగా ఉండేలా కనిపిస్తున్నారు. ఏళ్లవుతున్నా తరగని సౌందర్యంతో అలరిస్తూ వస్తున్నారు ఐశ్వర్య రాయ్ బచ్చన్. పారిస్ ఫ్యాషన్ వీక్ లో రెడ్ కార్పెట్ పై నడిచి వస్తున్న ఐష్ ను చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.
మొత్తంగా సామాజిక మాధ్యమాలలో ఐశ్వర్య మరోసారి ట్రెండింగ్ లో నిలిచారు. ఎంతైనా అందానికే ప్రయారిటీ అని తేలి పోయింది కదూ.