AR Rahman : ఏఆర్ రెహమాన్, సైరాభాను ల విడాకులపై అడ్వకేట్ కీలక వ్యాఖ్యలు

అంతకుముందు విడాకుల నేపథ్యంలో రెహమాన్‌ పై వస్తున్న విమర్శలపై సైరా మాట్లాడుతూ....

Hello Telugu - AR Rahman

AR Rahman : లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్‌(AR Rahman), సైరాభాను 29 ఏళ్ల తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎదో ఒక రకమైన వార్తలు ఈ టాపిక్ పై సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సైరాభాను లాయర్ వందన షా ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ.. పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో వాళ్లే ఫిక్స్ అవుతారు. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలేం కాదు.. వ్యక్తిగత అభిప్రాయాలు, స్వేచ్ఛ వారికి ఉందన్నారు. ఇక భరణం గురించి మాట్లాడుతూ.. సైరా ఎలాంటి ఆర్థిక ఉద్దేశాలతో ఈ నిర్ణయం తీసుకోలేదు, ఈ విషయంపై నేను ఎక్కువగా మాట్లాదలుచుకోలేదన్నారు. అలాగే వీరిద్దరూ మళ్ళీ కలిసే అవకాశం లేకపోలేదన్నారు. నేను ఆశావాదిని ఎప్పుడు ప్రేమ, రొమాన్స్ గురించి మాట్లాడుతాను కానీ వాళ్ళు ఎన్నో చర్చల తర్వాత బాధతో విడాకుల నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ వాళ్ళు కలిసే అవకాశం లేదని చెప్పలేము అన్నారు.

AR Rahman…

అంతకుముందు విడాకుల నేపథ్యంలో రెహమాన్‌ పై వస్తున్న విమర్శలపై సైరా మాట్లాడుతూ..‘ప్రస్తుతం నేను ముంబయిలో ఉన్నా. గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాలేదు. ఆ కారణంతోనే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నా. యూట్యూబ్‌, తమిళ మీడియాను ఒక్కటే కోరుకుంటున్నా. దయచేసి ఆయన గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయవద్దు. ఆయన చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో రెహమాన్‌ ఒకరు. సైరా ఎక్కడికి వెళ్లిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ట్రీట్‌మెంట్‌ కోసం ముంబయి వచ్చా. ఆయన అంటే నాకెంతో ఇష్టం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. ఆయనపై విమర్శలు చేయడం ఇకనైనా ఆపండి. మేము ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కాబట్టి ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు. త్వరలోనే నేను చెన్నై వస్తా.ఆయన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దు’’ అని ఆమె కోరారు.

Also Read : Chai Sobhita : అక్కినేని ఇంట్లో చైతన్య శోభితల పెళ్లి బాజాలు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com