Adivi Sesh: మరోసారి గొప్పమనసు చాటుకున్న అడవి శేష్ !

మరోసారి గొప్పమనసు చాటుకున్న అడవి శేష్ !

Hello Telugu - Adivi Sesh

Adivi Sesh: యువ హీరో అడివి శేష్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మంచి మనసుతో స్పందించడంలో ఎప్పుడూ ముందుండే అడవి శేష్… ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలో అడివి శేష్ తీసుకున్న చొరవ… ఇప్పుడు ఆయన్ని వార్తలలో హైలెట్ చేస్తోంది. ఇంతకు ముందు ‘మేజర్’ సినిమాకి కథగా తీసుకున్న మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రుల విషయంలో ఆయన ఎలాంటి కేర్ తీసుకున్నారో, తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే.

Adivi Sesh…

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…. ఇండస్ట్రీకి చెందిన ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా తన చిన్నారి అభిమాని గురించి తెలుసుకున్న శేష్(Adivi Sesh)… వెంటనే ఆమె కుటుంబ సభ్యులని సంప్రదించారు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. చిన్నారి కోసం ఒక క్యూట్ సర్‌ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఒక హోటల్‌ లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలిసి సర్ప్రైజ్ చేశారు. పాపతో రోజంతా సరదాగా ఆడుతూ గడిపారు.

చిన్నిపాప, ఆమె కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటున్న శేష్, అవసరమైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. కన్సల్టేషన్ కోసం హైదరాబాద్‌ కు వచ్చినప్పుడు వారిని మళ్లీ కలుసుకున్నారు. శేష్‌ కి డై -హార్డ్ ఫ్యాన్ అయిన ఆ చిన్నారి తన అభిమాన హీరోని కలవాలని చాలా కాలంగా కలలుకంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న శేష్, ఆమె కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే ఆ పాపని కలిసి, ఒక రోజంతా ఆమెతోనే సరదాగా గడిపి.. చిన్నారిలో ఆనందం నింపారు. దీనితో ఆన్ స్క్రీన్ మీదే కాదు, అఫ్ స్క్రీన్‌ లోనూ అడివి శేష్ లార్జర్ దెన్ లైఫ్ హీరో అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Anna Konidala: సింగపూర్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ పట్టా స్వీకరించిన అన్నా కొణిదెల !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com