Adi Shankaracharya : వెబ్ సిరీస్ లో ‘ఆదిశంకరాచార్యులు’ గారి జీవిత చరిత్ర

ట్రైలర్ విడుదల అనంతరం గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ....

Hello Telugu - Adi Shankaracharya

Adi Shankaracharya : భారతదేశపు గొప్ప హీరో చరిత్ర వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారతదేశ సాంస్కృతిక పునర్వైభవానికి ఎంతో కృషి చేసిన ‘ఆదిశంకరాచార్య(Adi Shankaracharya)’ జీవిత చరిత్రను వెబ్ సిరీస్ రూపంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తీసుకురాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విజయదశమి పర్వదినాన ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, మానవతావేత్త శ్రీశ్రీ రవిశంకర్ సమక్షంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ విడుదల చేసింది. ఆదిశంకరుని బాల్య జీవితం, భారతదేశ వ్యాప్తంగా అతడి పర్యటన, ఆధ్యాత్మిక వైభవ పునరుద్ధరణ, అతడు స్థాపించిన ఆచార వ్యవహారాలు ఈనాటికీ కొనసాగుతున్న తీరును కళ్లకు కట్టినట్టుగా ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సిరీస్ మొదటి సీజన్లో 40 నిమిషాల నిడివి గల 10 ఎపిసోడ్లు ఉంటాయని, వీటిలో శంకరుని జననం నుండి 8 ఏండ్ల వయసు వరకూ జరిగిన సంఘటనలను చూడవచ్చని వారు తెలిపారు.

Adi Shankaracharya Life StAdi Shankaracharya

ట్రైలర్ విడుదల అనంతరం గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘జ్ఞానం అనేది కాలానుగుణంగా పునర్జీవితం కావలసి ఉంటుంది. ఆదిశంకరుడు భారతీయ ప్రాచీన వేద విజ్ఞానాన్ని పునర్జీవింపజేసిన మహామనిషి. అతడు భక్తిని, జ్ఞానాన్ని, కర్మ యోగాన్ని ఏకీకృతం చేసి మనకు అందించాడు. జీవితం అంటే కష్టాలు, విషాదం కాదు.. జీవితం అంటే పరమానందం అనేది అతడిచ్చిన సందేశం’’ అని పేర్కొనగా.. శ్రీశ్రీ పబ్లికేషన్స్ ట్రస్టీ నకుల్ ధావన్ మాట్లాడుతూ.. ‘‘భారతీయ చరిత్రలో సైతం ఆదిశంకరునికి ప్రత్యేక స్థానం ఉంది. అతడి పేరు అందరూ విని ఉంటారు, అయితే అతడి జీవిత చరిత్ర చాలా మందికి తెలియదు. అతడు జీవించిన అతి తక్కువ కాలంలోనే భారతదేశం నలుమూలలకూ కాలినడకన పర్యటించి, భారతీయ సనాతన ధర్మాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని సమైక్యపరచి భావితరాలకు అందించాడు. ఆనాడు శంకరుడు స్థాపించిన ధర్మాలు, ఆచార వ్యవహారాలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. భారతదేశపు సాంస్కృతిక పునరుద్ధరణకు అతడు మూలస్తంభం’’ అని అన్నారు.

ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్న ఓంకార్ నాథ్ మిశ్ర మాట్లాడుతూ.. ‘‘ఈ వెబ్ సిరీస్ ఆదిశంకరాచార్యు(Adi Shankaracharya)నికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తున్న ప్రయత్నం. అతడి జ్ఞానం, బుద్ధి కుశలత, ఆధ్యాత్మిక వైశిష్ట్యం భారతదేశాన్ని తీర్చిదిద్దాయి. దేశం 300కు పైగా చిన్న రాజ్యాలుగా విడిపోయి బలహీనమై ఉన్న వేళ, అతడు అసేతుహిమాలయమూ కాలినడకన పర్యటించి, దేశాన్ని సనాతన ధర్మచ్ఛత్రం క్రింత ఏకీకృతం చేశాడు. భారతదేశ సాంస్కృతిక పునర్వైభవానికి అతడు చేసిన కృషి వెలకట్టలేనిది. అతడి చరిత్రను ఈనాటి యువతరాన్ని ఆకట్టుకునే విధంగా అందించటం కోసమే ఈ వెబ్ సిరీస్ చేస్తున్నాము’’ అని తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వంలోకి మనల్ని ప్రయాణింపజేసే ఆదిశంకరుని జీవిత చరిత్ర వెబ్ సిరీస్ ట్రైలర్ శుభకరమైన విజయదశమినాడు విడుదల కావడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నవంబర్ 1వ తేదీ నుండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యాప్‌లో ఈ సిరీస్ ప్రసారం కానున్నదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు భారతదేశపు సనాతన కథానాయకుడి జీవిత చరిత్ర తెలుసుకునే అవకాశం లభిస్తుందని వారు ఆశాభావం వెలిబుచ్చారు.

Also Read : Kanguva Movie : రిలీజ్ కు ముందే ‘కంగువా’ అన్ని కోట్లు కలెక్షన్లు వస్తాయంటున్న నిర్మాత

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com