అహోరాత్రులు శ్రమించిన శాస్త్రవేత్తలు సాధించిన ఫలితం చంద్రయాన్-3 సక్సెస్ గా చంద్రుడి వద్దకు చేరడం. దీనిని కొందరు ప్రభాస్ నటించిన ఓం రౌత్ తీసిన ఆది పురుష్ మూవీ బడ్జెట్ తో పోల్చడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. వాటిని కాదనలేం. కానీ ఆది పురుష్ ను కేవలం వ్యాపార దృక్ఫథంతో తీశారు. చివరకు మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. ఇదే సమయంలో చంద్రయాన్ 3ని భారత దేశ ప్రజలు కట్టిన పన్నులతో వచ్చిన డబ్బులతో ఇస్రో భారీ ఖర్చుతో రూపొందించింది. దానికి దీనికి పోలిక అస్సలు లేనే లేదు.
రెండూ పూర్తిగా భిన్నమైనవి. హాలీవుడ్ సినిమాలు విక్రమ్ లాండర్ బడ్జెట్ కంటే రెట్టింపు, మూడింతలు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. వ్యక్తిగత నిర్మాత వ్యాపారం, వినోదం కోసం తనకు నచ్చిన సినిమాను నిర్మిస్తాడు.
చంద్రయాన్ -3 అనేది చంద్రుడిపై ల్యాండ్ చేసేందుకు దేశం సమిష్ట కృషి ఫలితం . ఇది ప్రపంచ వేదికపై భారత దేశాన్ని ముందు ఉంచుతుంది. ఇది దేశానికి, 140 కోట్ల భారతీయులకు గర్వ కారణమని గుర్తించాలి. ఇకనైనా సినిమాతో పోల్చడం మానేయాలి.