Adah Sharma: అరుదైన వ్యాధి బారిన పడిన మరో టాలీవుడ్ బ్యూటీ !

అరుదైన వ్యాధి బారిన పడిన మరో టాలీవుడ్ బ్యూటీ !

Hello Telugu - Adah Sharma

Adah Sharma: హీరోయిన్లు పైకి అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వ్యాధుల బారిన పడుతుంటారు. సమంత కొన్నాళ్ల ముందు మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడు మెల్లమెల్లగా బయటపడుతోంది. తాజాగా అదాశర్మ కూడా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని రివీల్ చేసింది. దీని వల్ల ఎంతలా బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.

Adah Sharma Health Issue

‘హార్ట్ ఎటాక్’ అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అదాశర్మ(Adah Sharma)… ఆ తర్వాత టాలీవుడ్‌లో వరస సినిమాలు చేసింది. కానీ పెద్దగా పేరు అయితే రాలేదు. దీనితో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయి… ‘ద కేరళ స్టోరీ’, ‘బస్తర్’ లాంటి మూవీస్‌ తో కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టింది.

‘కేరళ స్టోరీ మువీలో నటించినప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘బస్తర్’ చిత్రంలో నటించినప్పుడు బరువు పెరిగాను. ఎందుకంటే ఆ చిత్రంలో బరువైన గన్స్ మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటు కాస్త బలంగా ఉండటానికి రోజు 10-12 అరటిపళ్లు తిన్నాను. అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలని నాతో పాటు షూటింగ్‌ కి తీసుకెళ్లాను. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డూలు తినేదాన్ని’

‘కానీ ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం-పెరగడం వల్ల నా బాడీలో రకరకాల మార్పులు చోట్ చేసుకోవడంతో పాటు ఒత్తిడికి గురయ్యాను. ఇది కాదన్నట్లు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి నాకు ఉన్నట్లు తేలింది. దీని వల్ల పీరియడ్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను’ అని అదాశర్మ చెప్పుకొచ్చింది.

Also Read : Sonam Kapoor: సోనమ్ కపూర్ కు స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చిన భర్త !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com