Adah Sharma : తన కుటుంబంతో సహా సుశాంత్ సింగ్ ఇంటికి షిఫ్ట్ అయిన అదాశర్మ

నటిగా నేను చేసుకోవాల్సిన పనులు చాలానే ఉన్నాయి...

Hello Telugu - Adah Sharma

Adah Sharma : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిని నటి అదాశర్మ కొనుగోలు చేశారు. ఇటీవల రీమోడలింగ్‌ పనులు పూర్తి చేయించిన అదాశర్మ(Adah Sharma), తన కుటుంబంతో సహా అక్కడికి షిప్ట్‌ అయింది. మొత్తం ఇల్లంతా రీమోడలింగ్‌ చేశానన్నారు. మొదటి అంతస్తును గుడిలా మార్చేసినట్లు చెప్పారు. ఒక గదిని మ్యూజిక్‌ రూమ్‌గా, మరో దాన్ని డ్యాన్స్‌ స్టూడియోగా చేశానన్నారు. టెర్రస్‌ మొత్తం గార్డెన్‌లా మార్చేసినట్లు తెలిపారు. అయితే కొందరు ఆమె పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు.

నటిగా నేను చేసుకోవాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఇలాంటి కామెంట్‌లను పట్టించుకుంటే నేను అక్కడే ఆగిపోతాను అంటూ ఆ ఇంటిని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ‘ మన జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అభిప్రాయాన్ని తెలిపే హక్కు మన దేశంలో అందరికీ ఉంటుంది. నేను ఈ ఇంటిని కొనుగోలు చేయడంపై కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్లు వెల్లడించారు. ‘ నేను మంచి వ్యక్తిని’ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు చేయాలనిపించింది నేను చేశా. నా కోసం ఎవరూ మారకూడదని నేను అనుకుంటాను. అదే రూల్‌ ఇతరులకు వర్తిస్తుంది. వారి కోసం నేను నా పద్ధతి మార్చుకోను’ అని చెప్పారు.

Adah Sharma New House….

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటి గురించి మాట్లాడుతూ.. ‘నాకు ఈ ఇల్లు ఎంతో నచ్చింది. మా అమ్మ, అమ్మమ్మతో కలిసి ఇక్కడ ఉంటున్నాను. ఈ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉంది’ అని అదాశర్మ(Adah Sharma) అన్నారు. గతంలోనూ ఈ ఇంటిపై అదా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ ఇంటిని చూడగానే తనకు ఎంతో పాజిటివ్‌గా అనిపించిందని, అందుకే కొన్నట్లు చెప్పారు. ఏ బ్యాగ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టి నటుడిగా గుర్తింపు పొందిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 2020 జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంలోనే ఉరి వేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల మానసిక కుంగుబాటుకు గురి కావడంతో ఆయన మృతి చెందారని పోలీసులు తెలిపారు.

Also Read : Hero Darshan : హీరో దర్శన్, పవిత్ర గౌడ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com