Vinci Aloshious : సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే వారు ఉన్నారనేది బహిరంగ రహస్యం. క్యాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఉందంటూ ఆ మధ్యన సినీ రంగానికి చెందిన పలువురు నటులు వాపోయారు. తాజాగా మలయాళ సినీ రంగానికి చెందిన నటి విన్సీ అలోషియస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మాదక ద్రవ్యాలకు అలవాటైన హీరోలతో తాను నటించే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టింది. అలాంటి వారితో మాట్లాడేందుకు తాను ఒప్పుకోనంటూ ప్రకటించింది. ఇలాంటి సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు మనసు చంపుకుని నటిస్తున్నారంటూ వాపోయింది విన్సీ అలోషియస్.
Vinci Aloshious Shocking Comments
సెట్స్‌లో మాదకద్రవ్యాలు వాడిన నటుడితో పని చేయడం గురించి తన ఆలోచనలను తాజాగా పంచుకుంది, అలాంటి వ్యక్తులు పాల్గొన్న ప్రాజెక్టులలో తాను పాల్గొననని స్పష్టం చేసింది. ఆ మధ్యన ఇది తనకు వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చిన విషయాన్ని వెల్లడించింది. సెట్స్ లో అనుచితంగా ప్రవర్తించాడని దీంతో తాను గట్టిగా బుద్ది చెప్పానని తెలిపింది. ఇదిలా ఉండగా మలయాళ చిత్ర పరిశ్రమలో మాదక ద్రవ్య దుర్వినియోగం గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య విన్సీ అలోషియస్(Vinci Aloshious) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారని తెలిస్తే ఆ హీరో ఎంత గొప్ప స్టార్ అయినా నటించబోనంటూ ప్రకటించింది. ఒకప్పుడు ప్రధాన నటుడు డ్రగ్స్ వాడే సినిమాలో నటించాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆయనతో కలిసి పని చేయడంతో తాను నరకం అనుభవించానని చెప్పింది. తన దుస్తుల పట్ల అనుచిత కామెంట్స్ కూడా చేశాడని వాపోయింది. తను పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన జన గణ మనతో పాటు పలు సినిమాల్లో నటించింది.
Also Read : Shivangi Sensational :వరలక్ష్మి ‘శివంగి’ ఆహా తమిళ ఓటీటీలో రెడీ