Swara Bhaskar : వివాదాస్పద నటి స్వర భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం తను వైరల్ గా మారింది. ఏదో ఒక కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇదే సమయంలో చాలా మంది హీరోయిన్లు కాంట్రావర్షియల్ అయ్యేందుకు ఉత్సుకుత చూపిస్తున్నారు.
Swara Bhaskar Got Shock From Twitter
తాజాగా తను ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. అయితే ఉన్నట్టుండి పిట్టకూత తను షేర్ చేసిన ఫోటోస్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పేర్కొంది. అంతే కాదు తమ సంస్థకు సంబంధించిన రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంది.
వీటిని తాము పరిగణలోకి తీసుకోలేమని, కొందరి మనో భావాలను కించ పరిచేలా ఉన్నాయంటూ స్పష్టం చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించింది స్వర భాస్కర్. తాను ఎప్పటి లాగే తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ వచ్చానని ఇందులో తప్పేముందంటూ ప్రశ్నించింది.
Also Read : Pooja Hegde Shocking : అనుకోకుండా ప్రేమలో పడి పోయా