Sumalatha : జస్టిస్ ‘హేమ కమిటీ’ రిపోర్ట్ పై స్పందించిన నటి సుమలత

ఈ విషయాలను ధైర్యంగా బయటపెట్టిన మహిళలకు, అందుకు బాటలు వేసిన డబ్ల్యూసీసీకి ధన్యవాదాలు...

Hello Telugu - Sumalatha

Sumalatha : మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. మలయాళ ఇండస్ట్రీలో పని చేస్తోన్న చాలా మంది మహిళలకు చేదు అనుభవం ఎదురైనట్లు హేమ కమిటీ రిపోర్ట్ తెలిపింది. దాంతో చాలా మంది బయటకు వస్తున్నారు. తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి దైర్యంగా మాట్లాడుతున్నారు. చాలా మంది నటీమణులు ఇండస్ట్రీలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఇతర భాషల్లోనూ హేమ తరహా కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తాజాగా నటి, మాజీ ఎంపీ సుమలత(Sumalatha) ఇండస్ట్రీలో జరుగుతోన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఇలాంటి అనుభవాలను తనతో చాలా మంది పంచుకున్నారని సుమలత(SUmalatha) అన్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో ఈ తరహా పవర్ గ్రూపులు ఉంటాయి. సినీ పరిశ్రమలో మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలను అమలు చేసేందుకు సెన్సార్ బోర్డు ఉన్నట్లే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉండాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని సుమలత తెలిపారు.

Sumalatha Comment

‘‘సినిమా ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి. ఇదొక చారిత్రక ఘట్టం. ఈ విషయాలను ధైర్యంగా బయటపెట్టిన మహిళలకు, అందుకు బాటలు వేసిన డబ్ల్యూసీసీకి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలకు భద్రత కల్పించే చారిత్రాత్మక చర్య ఇది. ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన చేదు అనుభవాలను బయట పెడుతోన్న మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ సమస్యలన్నింటిపై చర్యలు తీసుకోవాలి. నేను పనిచేసిన చాలా ఇండస్ట్రీలు కుటుంబంలా ఉన్నాయి. అయితే సెట్స్‌లో చాలా మందికి భయానక అనుభవాలు ఎదురవుతున్నాయని నేను కూడా విన్నాను. అవకాశాలకోసం వేధింపులు ఎదుర్కొన్నామని చాలా మంది మహిళలు నాతో చెప్పారు. వారు బయటకు చెప్పుకోవడానికి భయపడ్డారు. దైర్యంగా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళను చెడుగా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడం చూసి సంతోషిస్తున్నాను’ అని సుమలత(Sumalatha) అన్నారు.

“నేను ఇలాంటి సంఘటనలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను చూడలేదు కాబట్టి అది జరగలేదని కాదు. ఇతర భాషల్లోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ వారు బయటకు రావడానికి ధైర్యం చేయరు. ప్రతి రంగంలోనూ ఇలాంటి పవర్ గ్రూపులు ఉన్నాయి. కాబట్టి, సెట్స్‌లో మహిళల భద్రతను కలిపించేలా నిబంధనలను తీసుకురావడం అలాగే వాటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక పరిష్కారం. నిర్మాత, దర్శకుడు లేదా ప్రొడక్షన్ హౌస్ అటువంటి యూనియన్లు, సంస్థల మాట వినకపోవచ్చు. కాబట్టి, జాతీయ స్థాయిలో రాజ్యాంగం ప్రకారం సెన్సార్ బోర్డ్ నమూనాలో ఒక సాధారణ సంస్థను ఏర్పాటు చేయాలి. వారు ఈ నిబంధనలను అమలు చేయాలి. ఈ దేశంలో మహిళల భద్రత కోసం మనం కనీసం ఈ పనైనా చేయాలి అని సుమలత అన్నారు.

Also Read : Kalki 2898 AD OTT : వరల్డ్ లోనే ఒక సరికొత్త చరిత్రను సృష్టించిన ‘కల్కి’ సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com