Shanti Priya : నటి శాంతి ప్రియ సంచలనంగా మరారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫోటోస్ ను పంచుకున్నారు. విచిత్రం ఏమిటంటే తను పూర్తిగా గుండు కొట్టించుకుని ఉన్నారు. దీనికి మరో కారణం ఉందంటూ పేర్కొన్నారు. ఇన్ స్టా స్టోరీస్ నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అన్ని సాంప్రదాయ సౌందర్య ప్రమాణాలను ఉల్లంఘించి, సామాజిక నిబబంధనల నుండి తనను తాను విడిపించు కోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. మరీ ఫోటోలు బోల్డ్ గా ఉండడం పట్ల సర్వత్రా ఆసక్తిని మరింత రేపేలా చేసింది.
Shanti Priya Shocking Comments
నటి శాంతిప్రియ(Shanti Priya) 1990 సమయంలో సూపర్ హీరోయిన్ గా పేరు పొందారు. ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తన సోదరి భానుప్రియ. ఆమె కూడా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారూ. ఇద్దరూ విజయవంతమైన సినిమాలలో నటించారు. శాంతి ప్రియ బహు భాషలలో నటించింది. అందంగా ఉన్న జట్టును గుండు గీయించుకుంది. బట్టతలను తాను గర్వంగా భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. సాంప్రదాయ సౌందర్య ప్రమాణాలన్నింటినీ విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది శాంతి ప్రియ. సామాజిక నిబంధనల నుండి తనను తాను విడిపించుకుంది.
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వరుస చిత్రాలను పంచుకుంది, అభిమానులకు ఆమె కొత్త, బోల్డ్ అవతార్‌ను చూసేలా చేసింది. పూర్తి ఆత్మ విశ్వాసంతో , గాంభీర్యంతో స్వీకరిస్తున్నట్లు ఈ సామాజిక వేదికగా స్పష్టం చేసింది. ఈ సందర్బంగా తన భర్తను గుర్తు చేసుకుంది. తనతో జ్ఞాపకం ఇంకా పదిలంగా ఉందని, అది శాశ్వతమని దానిని ఎవరూ చెరప లేరంటూ పేర్కొంది 55 ఏళ్ల నటి. మొత్తంగా తనంతకు తానుగా ఏర్పాటు చేసుకున్న పరిమితుల నుండి బయట పడ్డానంటూ పేర్కొంది.
Also Read : Hero Dhanush-Mari Selvaraj :మారి సెల్వరాజ్ తో ధనుష్ కొత్త మూవీ