Sanam Shetty : సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. తమకు అవకాశాలు ఇచ్చేందుకు సినీ రంగానికి చెందిన వారు తమను బహిరంగంగానే పడుకుంటేనే ఛాన్స్ లు ఇస్తామని అంటున్నారని వాపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి సినీ రంగానికి చెందిన ప్రతి విభాగంలోనూ ఇదే తంతు కొనసాగుతోందన్న విమర్శలు లేక పోలేదు.
Sanam Shetty Shocking Comments
ఇటీవలే కొత్త బంగారు లోకంలో హీరోయిన్ గా చేసి, ఆ తర్వాత రెడ్ హ్యాండెడ్ గా వ్యభిచారం చేస్తూ చిక్కుకున్న నటి శ్వేత బసు ప్రసాద్ అయితే ఏకంగా ఓ టాలీవుడ్ హీరో తనను తీవ్రంగా లైంగికంగా వేధించాడని ఆరోపించింది.
తాజాగా మరో హీరోయిన్ సనం శెట్టి(Sanam Shetty) బహిరంగంగానే సంచలన విమర్శలు చేసింది. తనను కొందరు నిర్మాతలు రాత్రి బెడ్ రూంకు వస్తేనే ఛాన్స్ లు ఇస్తామని బహిరంగంగానే అంటున్నారని వాపోయింది. సినీ ఇండస్ట్రీలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని పేర్కొంది. హీరోలకు ఒక న్యాయం, హీరోయిన్లకు మరో న్యాయం ఎలా అని ప్రశ్నించింది.
సనమ్ శెట్టి శ్రీమంతుడు మూవీలో చిన్న పాత్ర పోషించింది. తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో నటించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీ మీద జుగుస్సాకరమైన భావం ఉండేలా చేస్తోంది. తను 2016లో అందాల పోటీలో విజేతగా నిలిచారు. 2020లో తమిళ బిగ్ బాస్ రియాలిటీ సీరీస్ లో పోటీదారుగా ఉన్నారు. అంబులి, కథంకథం చిత్రాలలో నటించారు. ఇండస్ట్రీలో సమానత్వం లేదని వాపోయింది.
Also Read : Hero Chiranjeevi : హిచ్ కాక్ నాకు ఇన్సిపిరేషన్