Samantha : సినీ రంగంలో ఎప్పుడు ఎవరో ఒకరు చర్చనీయాంశంగా మారుతారు. ఎందుకంటే వారికున్న పాపులారిటీ అలాంటిది మరి. తాజాగా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత రుత్ ప్రభు హాట్ టాపిక్ గా మారారు. తనను అద్భుతంగా తెరకెక్కించిన ఘనత దిగ్గజ దర్శకుడు వాసుదేవ మీనన్ కే దక్కుతుంది.
Samantha Love..
తను అక్కినేని నాగ చైతన్యతో కలిసి చేసిన ఏం మాయ చేశావే మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆకట్టుకునే సన్నివేశాలు, అద్భుతమైన మాటలు, వీనుల విందైన పాటలు ఈ చిత్రాన్ని చిరకాలం గుర్తుండి పోయేలా చేసింది. ఆ తర్వాత సమంత(Samantha) కెరీర్ లో ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగ పడేలా చేసింది.
ఆ తర్వాత తను నటించిన అత్తారింటికి దారేది మూవీ తెలుగు వారిని మరింత దగ్గరగా చేసింది. ఈ సమయంలోనే నాగ చైతన్యతో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత విడి పోవడం జరిగింది. దీనికి పెద్దగా కారణాలు ఏవీ తెలియక పోయినా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వేరవుతున్నామంటూ ప్రకటించారు ఇద్దరూ.
నాగ చైతన్య ప్రస్తుతం శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకోగా సమంత రుత్ ప్రభు మాత్రం ఒంటరిగా మిగిలి పోయింది. తను చెప్పుకోలేని రోగంతో బాధ పడుతున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. తను కూడా ధ్రువీకరించింది కూడా. ఈ సమయంలో తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. కాగా ఉన్నట్టుండి ఇప్పుడు ఫుల్ బిజీగా మారి పోయింది సమంత. వెబ్ సీరీస్, మూవీస్ తో ఎంజాయ్ చేస్తోంది.
కాగా వెబ్ సీరీస్ తీస్తున్న దర్శకుడి ప్రేమలో పడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమేనా అని అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Saif Attack : సైఫ్ ఘటనలో ఇద్దరు నిందితులు అరెస్ట్