Sai Pallavi : ఎవరైనా దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టు కోవాలని అనుకుంటారు. ప్రత్యేకించి సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఇప్పుడు హింస, ఎక్స్ పోసింగ్, రోమాన్స్ కే ప్రయారిటీ ఇస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఎంతగా అందాలను ఆరబోస్తే సినిమాలు నడుస్తాయనే భ్రమలో ఉన్నారు. ప్రత్యేకించి కొందరు దర్శకులైతే స్పెషల్ సాంగ్స్ పేరుతో మరీ జుగుస్సాకరంగా ఉండేలా చిత్రీకరిస్తున్నారు. కానీ కొందరు నటీమణులు మాత్రం కోట్లు కుమ్మరించినా సరే ఎక్స్ పోజింగ్ ఒప్పుకోమంటున్నారు.
Sai Pallavi…
ఇటీవలి కాలంలో ఇలాంటి నటీమణులు కూడా ఉంటారా అన్న అనుమానం కలగక మానదు. కానీ సమాజంలో ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకునే పాత్రలలో నటించాలని తాను అనుకుంటానని స్పష్టం చేసింది సాయి పల్లవి(Sai Pallavi). తను ఇటీవల నాగ చైతన్యతో కలిసి తండేల్ మూవీలో నటించింది. ఇందులో ఆమె చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చేసింది. మరోసారి తనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.
కొందరు నిర్మాతలు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారని, ఎక్స్ పోజింగ్ ఉన్న పాత్రలకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినా ఎక్కడా తగ్గలేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా డోంట్ కేర్ అంటూ కుండ బద్దలు కొట్టింది. దీంతో ఆఫర్స్ ఇచ్చిన వారు బిగ్ షాక్ కు లోనయ్యారు. తాను ఎంచుకునే పాత్రలకు జీవం ఉండేలా జాగ్రత్ పడుతోంది సహజ నటి.
Also Read : Vidaamuyarchi Success : తెరపై విడాముయార్చి హల్ చల్