Sai Pallavi : భిన్నమైన పాత్రలతో తన కంటూ ఓ ప్రత్యేకతను స్వంతం చేసుకున్న నటి సాయి పల్లవి. బలమైన కంటెంట్ ఉంటేనే కానీ సినిమాలకు ఒప్పుకోదు. సమాజానికి హితం చేకూర్చే సినిమాలకు, కథలకు ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. అందుకే సాయి పల్లవి(Sai Pallavi)ని జనం ఆదరిస్తున్నారు. భావోద్వేగాలను పండించడంలో తనకు తనే సాటి.
Sai Pallavi Comment
తను ఈ మధ్య చిట్ చాట్ సందర్బంగా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తాను ఎక్కడికి వెళ్లినా తన పరిధిలో ఉండేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పింది. మన అనుమతి లేకుండా ఇంకొకరు మనపై నియంత్రించడం ఉండదంటూ స్పష్టం చేసింది సాయి పల్లవి.
ప్రతి ఒక్కరికీ ప్రైవసీ అనేది ఉంటుందని, దానిని గుర్తించి మసులుకుంటే మంచిదని సూచించింది. తాను బయటకు వెళ్లిన సమయంలో కొంత భయంగా ఉంటుందని చెప్పింది. ఎవరైనా కొంత కాలం మాత్రమే సినీ ఇండస్ట్రీలో ఉంటారు. చాలా సినిమాలలో నటించమని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ తాను కేవలం వ్యక్తిత్వానికి భంగం కలిగించకుండా ఉండే పాత్రలనే ఎంచుకుంటున్నానని చెప్పారు సాయి పల్లవి.
మనుషులన్నాక భావోద్వేగాలు ఉండడం అత్యంత సహజమన్నారు. అందుకే వాటిని నియంత్రించు కునేందుకు తాను ధ్యానాన్ని ఆశ్రయిస్తానని, ఇదే తన వెనుక ఉన్న విజయ రహస్యమని స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ.
Also Read : Hero Salman-Rashmika : సల్మాన్ రష్మిక ‘సికిందర్’ డేట్ ఫిక్స్