Rekha : భారతీయ సినీ పరిశ్రమలో కొందరు మాత్రం వయసు పెరిగే కొద్దీ ప్రత్యేకంగా కనిపిస్తారు. వయసు పెరిగే కొద్దీ ఇంకా మరింత అందంతో అలరిస్తున్నారు. ప్రేక్షకుల గుండెలను మీటుతున్నారు. జీవిత కాలమంతా ఆనందంతో , సంతోషంతో ఉంటూ తమను తాము ప్రత్యేకంగా ఉంచుకునేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. కోట్లాది మంది హృదయాల మీద చెరగని ముద్ర వేసుకున్న నటీమణి, యువత ఐకాంతిక రేఖ(Rekha). తన తండ్రి గొప్ప నటుడు శివాజీ గణేశన్. దక్షిణాదికి చెందిన ఈ నటి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతోంది.
Actress Rekha
కొన్నేళ్లుగా తన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎంతో మంది హీరోయిన్లు ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. చూపులో, నడతలో, నటనలో తనకు తనే సాటి. తన ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. వాటిలో సిల్ సిలా, కభీ కభీ మూవీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నదగిన 100 చిత్రాలలో ఒకటిగా ఉన్న మూవీ ఉమ్రావ్ జాన్. ఇప్పటికీ ఎప్పటికీ క్లాసిక్ . మరోసారి ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. చిట్ చాట్ సందర్బంగా తనకు ఇష్టమైన సినిమా, పాత్ర ఉమ్రావ్ జాన్ అని స్పష్టం చేసింది.
తాజాగా తను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఉమ్రావ్ జాన్ చిత్రానికి సంబంధించి కొత్త లుక్ లో తిరిగి దర్శనం ఇచ్చింది రేఖ. తన కవ్వించే చూపుతో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఇంతకు రేఖనేనా అని జనం విస్తు పోతున్నారు. ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇండియన్ టాప్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తీశాడు రేఖను. ఆ ఫోటోలను సామాజిక మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. లక్షలాది మంది ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తన కట్టు, బొట్టు, చూపుతో నిజమైన రాజకుమారిని తలపింప చేస్తోంది ఈ వయసులో కూడా .
Also Read : Beauty Krithi Shetty-Paradise :శ్రీకాంత్ ఓదెల మూవీలో బేబమ్మ