Reba Monica John : మలయాళీలు ఘనంగా జరుపుకునే పండగా ఓనమ్. కేరళ ప్రజలకు ఈ పండగా అత్యంత ప్రత్యేకం. సామాన్యులతోపాటు సెలబ్రెటీలు కూడా ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. తాజాగా సెప్టెంబర్ 15న ఓనమ్ సందర్భంగా సినీతారలు ఓనమ్ సంబరాల్లో మెరిసిపోయారు. మలయాళీలు ఘనంగా జరుపుకునే పండగా ఓనమ్. కేరళ ప్రజలకు ఈ పండగా అత్యంత ప్రత్యేకం. సామాన్యులతోపాటు సెలబ్రెటీలు కూడా ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. తాజాగా సెప్టెంబర్ 15న ఓనమ్ సందర్భంగా సినీతారలు ఓనమ్ సంబరాల్లో మెరిసిపోయారు. తెల్లని కసావు చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది. రెబా మోనికా జాన్.. కర్ణాటకలోని బెంగుళూరులో సెటిల్ అయిన ఓ మలయాళీ కుటుంబంలో 1994 ఫిబ్రవరి 4న జన్మించింది. ఈ బ్యూటీ కుటుంబం క్రైస్తవ మతానికి చెందినవారు.
Reba Monica John…
మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన రెబా మోనికా(Reba Monica John).. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2016లో జాకోబింటే స్వర్గరాజ్యం అనే సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో మెరిసింది. 2023లో శ్రీ విష్ణుకు జోడిగా కామెడీ డ్రామా సామజవరగమన సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ రెబాకు అంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు.
Also Read : Jani Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు