Actress Ramya : కన్నడ సినీ రంగానికి చెందిన నటి రమ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రెమ్యునరేషన్ విషయంపై ఆమె నోరు విప్పింది. ఇదో రంగుల లోకమని, కానీ ఇక్కడ కూడా మహిళా హీరోయిన్ల పట్ల పారితోషకం విషయంలో తేడాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బెంగళూరులో ఫిలిం ఫెస్టివల్ కొనసాగుతోంది. ముఖ్య అతిథిగా హాజరైన రమ్య తన అభిప్రాయాలను పంచుకుంది. చాలా మటుకు సినిమా తీసినంత అందంగా ఉండవు తమ జీవితాలంటూ పేర్కొంది.
Actress Ramya Shocking Comments
ప్రస్తుతం రమ్య(Actress Ramya) రెమ్యునరేషన్ పై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తమతో పాటు వచ్చే హీరోలకు మొదట్లో పారితోషకం తక్కువగా ఉంటుందని, ఆ తర్వాత ఒక్కసారి మూవీ గనుక హిట్ అయితే చాలు ఇక వాళ్ల రెమ్యూనరేషన్ తమకు ఇచ్చిన దానికంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. తను ప్రస్తుతం సినిమా రేంజ్ ను బట్టి, పాత్రను చూసి తాను రూ. 1 కోటి తీసుకుంటానని చెప్పారు. కానీ హీరో విషయంలో రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల దాకా ఉంటుందన్నారు రమ్య.
ఒక్క శాండిల్ వుడ్ మాత్రమే కాదు కోలివుడ్, మాలివుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో సైతం హీరోయిన్లు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కన్నడ సినీ నటి. దర్శక, నిర్మాతలు తమ ధోరణిలో మార్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు రమ్య.
Also Read : Rukshar Dhillon Shocking :వద్దని చెప్పినా ఫోటోలు తీస్తే ఎలా..?