Pragya : బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌటేలా కలిసి నటిస్తున్న డాకూ మహారాజ్ చిత్రం భారీ అంచనాల మధ్య ఈనెల 12న విడుదల కానుంది. ఇప్పటికే బాలయ్య నట విశ్వ రూపం సినిమాలో కనిపించేలా చూశాడు దర్శకుడు.
Pragya Jaiswal Comment
ఇక పాటలు కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఎప్పటి లాగే బాలయ్య డైలాగులు పేలనున్నాయి. డాకూ మహారాజ్ గా ఫ్యాన్స్ కు పిచ్చెక్కించడం ఖాయమంటున్నారు అందులో నటించిన హీరోయిన్లు. సినిమా విడుదల రోజే తన పుట్టిన రోజు కావడం మరింత సంతోషంగా ఉందన్నారు నటి ప్రగ్యా జైస్వాల్.
నందమూరి బాలకృష్ణతో కలిసి నటించడం ఓ గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది. డాకూ మహారాజ్ లో తన కేరక్టర్ పేరు కావేరి అని, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర అని, తప్పకుండా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదని పేర్కొంది ప్రగ్యా జైస్వాల్.
తన సినీ కెరీర్ లో ఈ సినిమాను మరిచి పోలేనని అన్నారు. ఇప్పటి వరకు తాను చేసిన పాత్రలలో కంటే ఈ పాత్ర గొప్పగా ఉంటుందని పేర్కొన్నారు. చాలెంజ్ గా తీసుకుని చేశానని, తనకు ఈ ప్రాత కోసం ఎంపిక చేసిన దర్శకుడు బాబీకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు నటి.
Also Read : Beauty Sreemukhi Apology : హిందూ సంఘాలకు శ్రీముఖి క్షమాపణ