ఒకప్పుడు నటిగా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు పొందిన ప్రగతి ఉన్నట్టుండి సీరియస్ అయ్యారు. ప్రత్యేకించి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ప్రచారం చేస్తారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ప్రత్యేకించి ఈ మధ్యన టెక్నాలజీ వచ్చాక ఎలాంటి ఆధారాలు లేకుండా, వివరణ కూడా తీసుకోకుండా వార్తలు రాస్తున్నారంటూ వాపోయింది నటి ప్రగతి. ఆమె గతంలో తమిళం, తెలుగు రంగాలకు సంబంధించి పలు సినిమాలలో నటించింది.
గత రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారారు. ఆమె త్వరలోనే రెండో పెళ్లికి రెడీ అవుతోందని, వరుడు కూడా దొరికాడంటూ ప్రచారం జరిగింది. దీనిపై తీవ్రంగా స్పందించారు నటి ప్రగతి.
మీడియాకు వ్యక్తిగతంగా దాడి చేసే హక్కు లేదని పేర్కొంది. తమకు కూడా జీవితాలు ఉంటాయన్న సోయి లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించింది. ఇక నుంచి తాను ఊరుకునే ప్రసక్తి లేదని పేర్కొంది. తన వ్యక్తిగత ఇమేజ్ కు డ్యామేజ్ చేస్తే ఒప్పుకోనంటూ హెచ్చరించింది.