Pragathi : సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో నటి ప్రగతి ఒకరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సీనియర్ నటి. ప్రగతి(Pragathi) ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది. ప్రగతి(Pragathi) కేవలం నటి మాత్రమే కాదు. 2023లో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో ఆమె కాంస్య పతకం సాధించింది. సినిమాల్లో ఎక్కువగా ఆమె హీరోఎం హీరోయిన్స్ తల్లి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సినిమా ఏదైనా ప్రగతి ఖచ్చితంగా ఉంటారు.
Pragathi Comments..
కెరీర్ బిగినింగ్ లో ప్రగతి కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పింది. అలాగే ఓ యాడ్ లోనూ నటించింది. అది చూసి తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా వీట్ల విశేషంగాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆతర్వాత వరుసగా ఏడు తమిళ సినిమాలు, ఒక మలాయళం సినిమాలో నటించింది. ఆతర్వాత పెళ్లి చేసుకోవడంతో చిన్న బ్రేక్ ఇచ్చింది. ఆతర్వాత తిరిగి సినిమాల్లో బిజీగా మారిపోయింది. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించారు ప్రగతి.
కాగా ఆమె ప్రస్తుతం సినిమాలతో పాటు పలు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ ప్రగతి(Pragathi) చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా ఆమె వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో తనను ఎదురైనా చేదు అనుభవం గురించి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఓ నటుడు చేసిన ఓ పనికి తాను షాక్ అయ్యాను అని తెలిపింది. ఆ టైంలో తనకు ఏం చేయాలో అర్ధం కాలేదు అని తెలిపింది. ఆ నటుడు తనతో చాలా పద్దతిగా ఉండేవాడు.
కానీ అప్పుడు ఎందుకు అలా చేశాడో అర్ధం కాలేదు. సెట్లో ఉన్నట్టుండి అసభ్యకరంగా ప్రవర్తించాడని.. దాంతో నేను తాను చాలా బాధపడ్డాను అని తెలిపారు ప్రగతి. ఆ బాధతో భోజనం కూడా చేయాలనిపించలేదు.. ఆ రోజు షూటింగ్ కూడా చేయలేకపోయా అని తెలిపారు ప్రగతి. ఆ తర్వాత అతనితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. క్యారవ్యాన్ లోకి వెళ్లి ఆయనతో మాట్లాడాను. నాతో ఎందుకు అలా ప్రవర్తించారు అని అడిగాను. దాంతో అతను నీళ్లు మింగాడు. నేను తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదని, ఒక్కసారి అయినా ఆలోచించారా?’ అని ప్రశ్నించాను. దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆతర్వాత తనకు పొగరు ఎక్కువ. యాటిట్యూడ్ ఎక్కువ అని నన్ను బ్యాడ్ చేశాడని నాకు తెలిసింది అని ఎమోషనల్ అయ్యారు ప్రగతి.
Also Read : Love Reddy : సినిమా చూసి ఆ నటుడి గూబ గుయ్ మనిపించిన మహిళ