Pooja Hegde : ప్రముఖ సినీ నటి పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేసింది. గత కొంత కాలంగా చలన చిత్ర రంగంలో కొనసాగుతున్న వివక్ష పట్ల, లైంగిక హింస పట్ల కొన్ని గొంతులు బహిరంగంగానే గళం విప్పుతున్నాయి. ఆ మధ్యన సింగర్ చిన్మయి శ్రీపాద గేయ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేసింది. తనను వేధింపులకు గురి చేశాడని వాపోయింది. ఆ తర్వాత ఎందరో సినీ రంగానికి చెందిన వారంతా ముందుకు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.
Pooja Hegde Shocking Comments on..
ఇప్పుడు ఆ బాధితుల జాబితాలోకి వచ్చి చేరింది సినీ నటి పూజా హెగ్డే(Pooja Hegde). తను మొదట మోడల్ గా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన తొలి అడుగు తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి. ముగమూడి అనే మూవీలో నటించింది. ఆ సినిమా ఆశించిన మేర ఆడలేదు. ఇదే సమయంలో అందం, అభినయం బాగుండడంతో ఉన్నట్టుండి ముకుంద మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది పూజా హెగ్డే. ఆ తర్వాత తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో నటించింది. టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రత్యేకించి టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు నెంబర్ వన్ గా నిలిచింది.
టాప్ హీరోల సరసన నటించింది. సూర్య, విజయ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ , షాహీద్ కపూర్ తదితరుల సరసన నటించింది. కీలక పాత్రలు పోషించింది. తనను తాను నటిగా ప్రూవ్ చేసుకుంది. బన్నీతో కలిసి నటించిన అల వైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతకు ముందు ఇదే నటుడితో హరీశ్ శంకర్ తీసిన దువ్వాడ జగన్నాథం లో నటించింది. తాజాగా షాహిద్ కపూర్ తో లిప్ లాక్ సీన్ లో మెరిసింది. తాజాగా చిట్ చాట్ చేసింది పూజా హెగ్డే(Pooja Hegde). సినీ పరిశ్రమలో లింగ వివక్ష ఉందంటూ పేర్కొంది. హీరో, హీరోయిన్ల మధ్య చాలా గ్యాప్ ఉందని పేర్కొంది. వారికి ఇచ్చే వసతులు తమకు ఉండవని వాపోయింది. తాజాగా పూజా హెగ్డే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Popular Actor Posani :చెరసాలను వీడిన పోసాని కృష్ణ మురళి