Pooja Hegde : దయా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ నటీ నటులు షాహీద్ కపూర్ , పూజా హెగ్డే జంటగా నటించారు. షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇందులో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పోలీస్ పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇక తనను మెస్మరైజ్ చేసే పాత్రలో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తోంది.
Pooja Hegde Movie Updates
ఈ సినిమాలో తన అందాలను మరింత ఆర బోసిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్విమ్ షూట్ లో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో కలిసి హరీశ్ శంకర్ తీసిన దువ్వాడ జగన్నాథంలో దుమ్ము రేపింది. బికినీ డ్రెస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
తను ముందు తమిళంలో నటించింది. అక్కడి నుంచి తెలుగులో గోపికమ్మా అంటూ పలకరించింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల వైకుంఠ పురంలో చిత్రం బిగ్ సక్సెస్ గా నిలిచింది. ఇదే సమయంలో తను జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన మూవీలో ప్రధాన పాత్రలో నటించింది..మెప్పించింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మెయింటెన్ చేసింది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మకాం మార్చేసింది. ప్రస్తుతం పలు హిందీ చిత్రాలలో సైన్ చేసి బిజీగా మారి పోయింది. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ తో నటించింది. ఇప్పుడు షహీద్ తో జత కట్టింది ఈ అమ్మడు.
Also Read : Beauty Samantha : సామ్ మళ్లీ ప్రేమలో పడిందా..?