హమాస్ ఉగ్ర దాడులతో ఇజ్రాయెల్ అట్టుడుకుతోంది. ఇప్పటికే ప్రవాస భారతీయులు బిక్కు బిక్కుమంటున్నారు. ఇదే సమయంలో ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ముంబైకి చెందిన బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా ఇజ్రాయెల్ లో ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున ఉగ్రమూకలు దాడులకు తెగబడుతున్నారు.
అక్కడే చిక్కుకు పోయిన ప్రవాస భారతీయులను ఇండియాకు క్షేమంగా తీసుకు వచ్చేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది భారత దేశ ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాన మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ లోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడుతున్నారు.
ఇదిలా ఉండగా అనుకోకుండా చిక్కుకు పోయిన నటి నుష్రత్ బరూచా ఎట్టకేలకు ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా ముంబై లోని విమానాశ్రయంకు చేరుకుంది. దీంతో ఊపిరి పీల్చుకుంది నటి. తాను తిరిగి ఇండియాకు వస్తానని అనుకోలేదని పేర్కొంది ఈ అమ్మడు.
ఒక రకంగా తిరిగి పునర్ జన్మ పొందినట్లు తాను భావిస్తున్నట్లు పేర్కొంది. తన లాగా చాలా మంది భారతీయులు అక్కడే ఉండి పోయారని, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయింది. మొత్తంగా తాను క్షేమంగా వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు నటి.