Actress Meena : బాలనటిగా తెరపైకి వచ్చిన మీనా ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. దక్షిణాది ఇండస్ట్రీల స్టార్ హీరోలు అందరితో కలిసి కనిపించడం చూసాము. ఆమె మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్, బాలకృష్ణ, మమ్ముట్టి, మోహన్‌లాల్ మరియు ఇతరులతో చాలా చిత్రాలలో నటించింది.
Actress Meena Comments Viral
దాదాపు 30 ఏళ్ల పాటు టాప్ హీరోయిన్ గా వెలిగిపోయింది. సినిమా షూటింగ్‌ల విరామంలో ఆమె వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను వివాహం చేసుకుంది. వారికి నైనిక అనే కుమార్తె ఉంది. అయితే, 2022లో మీనా(Meena) భర్త ఆరోగ్య కారణాలతో చనిపోయాడు. అయితే మీనా పునర్వివాహం గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాన్ని మీనా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. తాజాగా మినా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన పునర్వివాహంపై వచ్చిన పుకార్లను ఆమె మరోసారి ప్రస్తావించింది.
ఇది డబ్బు కోసం సంచలనం కలిగించేవి రాయాలని ప్లాన్ చేస్తున్నారా? సోషల్ మీడియా రోజురోజుకు దిగజారుతోంది. వాస్తవాలు తెలుసుకోకుండా రాస్తున్నారు. నిజానిజాలు తెలుసుకుని రాసుకుంటే అందరికీ మంచిదన్నారు. తనలాంటి ఒంటరిగా జీవించే మహిళలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారని ఆమె అన్నారు. తల్లిదండ్రులు, కుమార్తెలు భవిష్యత్తు గురించి ఆలోచించి రాయాలని… ఈ సమయంలో మళ్లీ పెళ్లి చేసుకుంటుందా లేదా భవిష్యత్తులో అన్న విష్యం తెలియలేదు.
Also Read : Theppa Samudram : తెప్ప సముద్రం సినిమా నుంచి పెంచల్ దాస్ రాసి పాడిన సరికొత్త గీతం