Kiara Advani : దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని అనుకుంటున్నారు ఈ మధ్యన నటీ నటులు. ఎప్పుడు టాప్ లో ఉంటామో ఎప్పుడు కిందకు పడి పోతామో తెలియని పరిస్థితి. సినిమా సక్సెస్ అయితే ఓకే లేదంటే ఎవరూ తమ వైపు చూడరని తెలుసుకున్నారు. అందుకే వచ్చిన అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నంతలో సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి హీరోలతో పాటు హీరోయిన్లు కూడా భారీగా పారితోషకం అందుకుంటున్నారు. ప్రధానంగా బాలీవుడ్ కు చెందిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం దర్శక ధీరుడు జక్కన దర్శకత్వం వహిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న ఎస్ఎస్ఎంబీ29 మూవీలో నటిస్తోంది.
Kiara Advani Remuneration
దీనికి ఏకంగా 20 కోట్లకు పైగానే డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తమిళ సినీ దర్శకుడు అట్లీ కుమార్ తీసిన జవాన్ సినిమా బిగ్ హిట్ అయ్యింది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. షారుక్ ఖాన్ తో నటించినందుకు గాను పెద్ద మొత్తంలోనే తీసుకుందని టాక్. ఇక ప్రియాంక పదుకొనే తో పాటు నేషనల్ క్రష్ గా మారిన రష్మిక మందన్నా సైతం రెమ్యూనరేషన్(Remuneration) విషయంలో తగ్గేదే లే అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో హీరోయిన్ గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఆమె ఎవరో కాదు కియారా అద్వానీ(Kiara Advani).
తను శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజతో కలిసి నటించింది గేమ్ ఛేంజర్ లో . ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయినా ఈ అమ్మడికి ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా హీరోగా ఉన్న కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. ఇందులో కీ రోల్ పోషిస్తోంది. ఈ మూవీలో నటించినందుకు గాను తను రూ. 15 కోట్లు డిమాండ్ చేసిందని కన్నడ చలన చిత్ర పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈమెకు ఇచ్చే పారితోషకంతో రెండు లేదా మూడు చిన్న సినిమాలు తీయొచ్చని అంటున్నారు సినీ క్రిటిక్స్. ఏది ఏమైనా కియారానా మజాకా అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండం విశేషం.
Also Read : TG Women Commission Warning :బూతు సినిమాలు..వల్గర్ డ్యాన్సులపై గుస్సా