Kasturi : బుల్లితెర నటి కస్తూరి శంకర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం తెలుగువారిని ఉద్దేశిస్తూ కస్తూరి చేసిన వ్యాఖ్యలపై జనాలు మండిపడుతున్నారు. దీంతో చెన్నైలో ఆమెపై పలు కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసుల విషయంలోనే ఆమెకు సమన్లు జారీ చేసేందుకు చెన్నై పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా.. అక్కడ తాళం వేసి ఉందని.. అలాగే కస్తూరి(Kasturi) ఫోన్ సైతం స్విఛ్చాప్ వస్తున్నట్లు సమాచారం. దీంతో ఆమె ఎక్కడ ఉందనే విషయంపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి తెలుగు ప్రజల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు వచ్చాయి.అయితే తన మాటలపై క్షమాపణలు చెప్పారు కస్తూరి(Kasturi). తెలుగు నా మెట్టినిల్లు.. తెలుగు వారంతా నా కుటుంబం అని తెలిపింది. కానీ తన మాటలను డీఎంకే పార్టీ మరోరకంగా ప్రచాం చేసిందని.. తనపై కుట్ర చేసారని చెప్పుకొచ్చింది.
Actress Kasturi…
డీఎంకేపార్టీ నేతలు తనను టార్గెట్ చేస్తున్నారని కస్తూరి మండిపడింది. కస్తూరిపై ఇప్పటికే చెన్నై, మధురై ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు సమన్లు జారీ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ తాళం వేసి కనిపించింది. ఆమెకు ఫోన్ చేసినా కూడా స్విఛ్చాఫ్ రావడంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసుల భయంతోనే కస్తూరి పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసుల విషయంలో ఆమె ఓ లాయర్ ను సంప్రదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హిందూపీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరుపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపురంలో మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగు వారు ఎవరు ? అంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
Also Read : Actor Sai Kiran : మరోసారి పెళ్లిపీటలెక్కనున్న ప్రముఖ నటుడు ‘సాయి కిరణ్’