Jyothika : నటి జ్యోతిక తన భర్త తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన కంగువ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను భారీ నిర్మాణంతో తీశారు. తన సినీ కెరీర్ లో సూర్య ఎక్కువగా దృష్టి సారించారు ఈ చిత్రంపై . కాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఆశించిన మేర రాణించలేదు. విడుదలయ్యాక మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. నిర్మాతలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. భారీ ఎత్తున ప్రచారం చేసినా ఆడలేదు. దీంతో సినీ క్రిటిక్స్ పెద్ద ఎత్తున కంగువ చిత్రంపై కామెంట్స్ చేశారు.
Jyothika Shocking Comments on Kanguva Movie
సూర్య నటించినా ఎందుకు ఆడలేదంటూ పేర్కొన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు విమర్శలు గుప్పించారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సినిమా విడుదలై రోజులు గడిచినా ఇంకా దాని గురించి చర్చించడం పట్ల సీరియస్ గా స్పందించారు నటి జ్యోతిక(Jyothika). తను ఇప్పుడు హిందీ వెబ్ సీరీస్ లో నటిస్తోంది కూడా.
సూర్య కంగువ వైఫల్యం చెందలేదని స్పష్టం చేసింది. ప్రతి చిత్రానికి కొన్ని లోపాలు ఉండడం సహజమేనని అన్నారు. దీనిపై ఎక్కువగా ఆలోచిస్తే ఎలా అని ప్రశ్నించింది జ్యోతిక. తనకు మీకంటే సూర్యపై నమ్మకం ఎక్కువ అని పేర్కొన్నారు . సినిమా అన్నాక అన్నీ విజయవంతం కావాలని రూల్ ఏం లేదన్నారు. అయితే కంగువ కోసం తన భర్త అష్టకష్టాలు పడ్డాడని, ప్రేక్షకులను ఆకర్షించడంలో ఫెయిల్ అయిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయినా తాము బాధ పడడం లేదన్నారు. ఎందుకంటే తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. వీటన్నింటి గురించి ఎక్కువగా పట్టించుకోడని తెలిపారు.
Also Read : TG Govt- Gaddar Awards Sensational :గద్దర్ అవార్డుల కోసం సర్కార్ ప్రకటన