Jyothika : సూర్య భార్య ప్రముఖ నటి జ్యోతిక కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు స్టార్ డమ్ మీద కంటే సింపుల్ గా ఉండటం ఇష్టమని స్పష్టం చేసింది. నటనా పరంగా తనకు మంచి పాత్రలు దక్కాయని,, ఇప్పటికీ కూడా నటించమంటూ చాలా ఆఫర్స్ వస్తున్నాయని తెలిపింది. చిట్ చాట్ సందర్బంగా తన అభిప్రాయాలను పంచుకుంది.
Jyothika Comments
తనతో పాటు భర్త సూర్యకు కుటుంబంతో గడపడటం ఇష్టం అని పేర్కొంది. ఇంకొకరి గురించి ఆలోచించేంత టైం తమకు ఉండదన్నారు. అందుకే ఈ స్టార్ డమ్ మీద తమకు నమ్మకం లేదని తెలిపింది. దానిని ఇంటి బయటే వదిలివేసి వచ్చేస్తామని చెప్పింది నటి జ్యోతిక(Jyothika).
నేను అత్యుత్తమమైన పాత్రలలో లీనమయ్యా. అద్భుతంగా నటించానన్న పేరు కూడా వచ్చేసింది. వాటిని నేను అంతగా పట్టించుకోను. ప్రత్యేకించి దక్షిణాదది చిత్రాలలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు జ్యోతిక.
జ్యోతిక, సూర్య సినీ పరిశ్రమలో రాక్ సాలిడ్ జంటగా ప్రసిద్ది చెందారు. ప్రస్తుతం జ్యోతిక సంచలనంగా మారారు. తను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీస్తున్న వెబ్ సీరీస్ డబ్బా కార్టెల్ లో కీలక పాత్ర పోషిస్తోంది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
డబ్బా వాలా అనేది ముంబైలో చాలా ఫేమస్. చిన్న పిల్లలకు మేం డబ్బాలు కడతాం. అవి లేకుండా పిల్లలు స్కూల్ కు వెళ్లరు. అలాగే ఇతరులు కూడా. డబ్బాలు మన జీవితంలో భాగమై పోయాయని స్పష్టం చేసింది నటి జ్యోతిక. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Hero Ranbir Kapoor :రణబీర్ కు కిక్ ఇచ్చిన యానిమల్