Actress Hema : రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట నిచ్చిన బెంగళూరు హైకోర్టు

హేమ విచారణకు హాజరుకాకపోవడంతో గతేడాది జూన్‌ 3న సెంట్రల్‌ క్రేౖమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు...

Hello Telugu - Actress Hema

Hema : బెంగుళూరు హైకోర్ట్‌లో తెలుగు నటి హేమ(Hema)కు ఊరట కలిగింది. గత ఏడాది మేలో బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో నటి హేమ(Hema) పాల్గొందని, డ్రగ్స్‌ తీసుకుందని కేసు నమోదై రిమాండ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ కేసు తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది. ఎన్‌డిపిఎస్‌ (నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌) చట్టంలోని సెక్షన్‌ 27(బి) కింద శిక్షార్హమైన నేరానికి సంబంధించి కేవలం సహ నిందితుడు ఒప్పుకోలు ప్రకటనపైనే పిటిషనర్‌పై ఛార్జ్‌ షీట్‌ వేయబడింది. రేవ్‌ పార్టీలో పిటీషనర్‌ ఎండీఎంఏ వినియోగించారని రుజువు చేయడానికి ధృవీకరించే అంశాలేమీ లేవు. అందుకే ప్రతివాది రాష్ర్టానికి నోటీసులివ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని జస్టిస్‌ హేమంత్‌ చందనగౌడర్‌ ఆదేశించారు. విచారణపై స్టే కోరుతూ నటి దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు పరిశీలించిన జస్టిస్‌ మంగళవారం అనుమతిస్తూ. ఉత్తర్వులు జారీ చేశారు.

Actress Hema Case..

హేమ(Hema) విచారణకు హాజరుకాకపోవడంతో గతేడాది జూన్‌ 3న సెంట్రల్‌ క్రేౖమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ సేవించడం, రైడ్‌ సమయంలో తప్పుడు పేర్లు, ఫోన్‌ నంబర్లు ఇవ్వడం, రేవ్‌ పార్టీలో నిషేధిత పదార్థాల గురించి ముందస్తుగా అవగాహన కల్పించడం, వీడియో స్టే ట్‌మెంట్లు ఇవ్వడం ద్వారా దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలు ఆమెపై ఉన్నాయి. బెంగళూరు సిటీకి సమీపంలో ఓ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ నిర్వహించగా, 80 మందికి పైగా హాజరైన వారు డ్రగ్స్‌ ేసవించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో హేమ కూడా ఉన్నారు. కేసు నమోదు తర్వాత హేమ అరెస్టై 10 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైంది. గతేడాది సెప్టెంబరులో హేమ సహా 87 మందిపై పోలీసులు వివరణాత్మకంగా ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. తను ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదని, నిందితుడి వాంగ్యూలం ఆధారంగా తనను కూడా నిందితురాలిగా కేసు పెట్టానని ఆమె పేర్కొన్నారు. అరెస్ట్‌ అయిన చాలా రోజుల తర్వాత ఆమెకు పరీక్షలు నిర్వహించారని హేమ తెలిపారు.

8వ అదనపు జిల్లా మరియు సెషన్స్‌ జడ్జి, బెంగళూరు రూరల్‌ ఎన్‌డిపిఎస్‌ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు పెండింగ్‌లో ఉన్న ఛార్జీషీట్‌, తదుపరి విచారణపై స్టే కోరుతూ హేమ దాఖలు చేసిన ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్ (ఐఎ) ను అనుమతిస్తూ న్యాయస్థానం స్టేకు ఆమోదించింది.

Also Read : SSMB29 Movie : నేడే డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా క్లాప్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com