Faria Abdullah : ఒకే ఒక్క మూవీతోనే స్టార్ డమ్ తెచ్చుకుంది ఫరియా అబ్దుల్లా(Faria Abdullah). సంప్రదాయ ముస్లిం కుటుంబంలో ఉన్నప్పటికీ తను సినిమాలలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తను కాస్తా పొడవుగా ఉంటుంది. తనకు తగ్గ హీరోలు మహేష్ బాబు, డార్లింగ్ ప్రభాస్. తనకు జాతి రత్నాలు చిత్రంతో పోషించిన చిట్టి పాత్రకు మంచి పేరొచ్చింది. తన నటన, పలికిన డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి.
Faria Abdullah Comment
ఆ తర్వాత అల్లరి నరేష్ తో ఫుల్ రోల్ పోషించగా నాగ్ తో ఓ స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది. ఇదే సమయంలో తను పూర్తిగా హైట్ కావడంతో ఇతర హీరోలతో నటించేందుకు ఇబ్బంది ఏర్పడింది. ఇదే తన కెరీర్ కు అడ్డంకిగా మారింది. అయినా ఎక్కడా తగ్గడం లేదు. తన లోకం మొత్తం సినిమానే.
ఆ మధ్యన డేటింగ్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు తను బోల్డ్ గా మాట్లాడుతుంది. తనకు ఏది మంచిది అనిపిస్తే అదే చెబుతుంది. ఇదే సమయంలో బాయ్ ఫ్రెండ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కొత్తగా ట్రై చేద్దామని తాను కూడా బాయ్ ఫ్రెండ్ వేటలో ఉన్నానంటూ బాంబు పేల్చింది. ఫరియా అబ్దుల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మొత్తంగా ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాలలో నటించాలని ఆశిద్దాం. తాజా సమాచారం జోడియన్ మారాబ్ ప్రేమలో పడినట్లు టాక్.
Also Read : Hero Balayya-Akhanda2:మహా శివ రాత్రికి అఖండ2 ఫస్ట్ లుక్