Divya Bharathi : తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ పై సంచలన కామెంట్స్ చేసింది నటి దివ్య భారతి(Divya Bharathi). ఇద్దరూ కలిసి బ్యాచిలర్, కింగ్ స్టన్ మూవీస్ లో నటించారు. తెర మీద ప్రేమను, రొమాన్స్ ను పండించారు. అయితే ఇటీవలే ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, పీకల లోతు ప్రేమలో కూరుకు పోయారని, అందుకే తను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యకు విడాకులు ఇచ్చాడని జీవీ ప్రకాశ్ పై విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది. మనోడు తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన నితిన్ రెడ్డి, శ్రీలీల కలిసి నటించిన రాబిన్ హుడ్ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. కానీ వర్కవుట్ కాలేదు.
Divya Bharathi Comment about her Dating Rumors
ఇదిలా ఉండగా తాను ఏ హీరో తోనూ డేటింగ్ చేయడం లేదంటూ స్పష్టం చేసింది నటి దివ్య భారతి. లేనిపోని ఆరోపణలు చేయడం, ఆధారాలు లేకుండా నిందలు వేయడం మంచి పద్దతి కాదని సూచించింది ఈ ముద్దుగుమ్మ. జీవి ప్రకాశ్ కుమార్(GV Prakash) ఎందుకు తన భార్యతో దూరంగా ఉంటున్నాడో తనకు తెలియదన్నారు. తనకు ఆయనకు లింకు పెట్టడం ఎంత వరకు సబబు అంటూ వాపోయింది. చిట్ చాట్ సందర్బంగా తన అభిప్రాయాలను పంచుకుంది దివ్య భారతి. ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల జీవితాల్లోకి తనను లాగడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించింది.
కావాలని ఎదుగుతున్న క్రమంలో లేని పోని అభాండాలు వేస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టకు ముప్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది దివ్య భారతి. కలిసి సినిమాలు చేసినంత మాత్రాన సంబంధాలను అంటగడితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా జీవి ప్రకాశ్ కుమార్ తన భార్యకు దూరంగా ఉండడం ఆయన ఇష్టమని, వ్యక్తిగత నిర్ణయమని, తాను ఎందుకు జోక్యం చేసుకుంటానని ఫైర్ అయ్యింది.
Also Read : Hero Dhanush-Idli Kadai OTT :రూ. 45 కోట్లకు ఇడ్లి కడై ఓటీటీ రైట్స్