Chitra Shukla : టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ చిత్రా శుక్లా శుభవార్త చెప్పింది. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు తెలిపింది. తాజాగా ఆమె సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఆ ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందీ అందాల తార. మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్ర శుక్లా.. 2014లో ‘ఛల్ భాగ్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ‘ పులి’, ‘నేను శైలజ’ చిత్రాల్లో సైడ్ డ్యాన్సర్‌గానూ కనిపించింది. 2016లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘మా అబ్బాయి’ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది చిత్ర శుక్లా. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Chitra Shukla…
ఆ తర్వాత రంగుల రాట్నం’, సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ తదితర చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. అయితే ఎందుకో గానీ ఈ అందాల తార స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. దీంతో 2023 డిసెంబర్‌లో వైభవ్ ఉపాధ్యాయ్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు చిత్ర శుక్లా, వైభవ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా నటి సీమంతం ఘనంగా జరిగింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read : Devara Trailer : నెట్టింట తెగ వైరల్ అవుతున్న తారక్ ‘దేవర’ ట్రైలర్