Pooja Hegde : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హాట్ టాపిక్ గా మారింది. తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో నటించింది..ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఒకానొక సమయంలో తను టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత మనసు మార్చుకుంది. ముంబైలోనే మకాం వేసింది. ఆపై హిందీ మూవీస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో జత కట్టింది. ప్రస్తుతం యంగ్ యాక్టర్ షహీద్ కపూర్ తో కలిసి దేవ యాక్షన్ రొమాంటిక్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.
Pooja Hegde Shocking Comments
తాజాగా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. దీంతో పూజా హెగ్డే(Pooja Hegde) తన సినిమా అనుభవాల గురించి చిట్ చాట్ లో వెల్లడించింది. ప్రధానంగా ఉత్తరాది, దక్షిణాది సినీ రంగాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.
ఉత్తరాది మూవీస్ లో నటించడం చాలా సులభమని, కానీ దక్షిణాది సినిమాల విషయానికి వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయని తెలిపింది. ప్రధానంగా నటించడం అంటే హావ భావాలను పలికించడం ముఖ్యమని, అర్థం చేసుకునేందుకు చాలా సమయం పడుతుందని చెప్పింది. తను తమిళంలో టాప్ హీరో దళపతి విజయ్ సరసన బీస్ట్ లో స్క్రీన్ పంచుకుంది. ఇది బిగ్ హిట్.
ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ప్రభాస్ , మహేష్ బాబు, బన్నీ, జూనియర్ ఎన్టీఆర్ తో విజయవంతమైన సినిమాలలో నటించింది. బన్నీతో దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురంలో బిగ్ హిట్స్ గా నిలిచాయి.
Also Read : Beauty Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీకి బంపర్ ఆఫర్