Balakrishna : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది నటుడు నందమూరి బాలకృష్ణను. ఈ సందర్బంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. తన బాబాయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ (తారక్). మీరు అందించిన సేవలకు దక్కిన అరుదైన గౌరవం అంటూ పేర్కొన్నారు.
Actors Congratilates Balakrishna
రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరారు. తమ బాబాయ్ పైకి కోపంగా కనిపించినా తన మనసు చిన్న పిల్లాడి మనస్తత్వం అంటూ పేర్కొన్నారు నందమూరి కళ్యాణ్ రామ్.
ఈ ఇద్దరు అన్నదమ్ములు సామాజిక మాద్యమాల ద్వారా స్పందించారు. బాబాయ్ కి అభినందనలు తెలియ చేశారు. సినిమా రంగానికి, బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా వేలాది జీవితాల్లో వెలుగులు నింపడంలో బాలయ్య కీలక పాత్ర పోషించారంటూ కితాబు ఇచ్చారు మాస్ మహారాజా రవితేజ.
ఈ అరుదైన గుర్తింపు సినిమా, కళ పట్ల నందమూరి బాలకృష్ణ(Balakrishna)కున్న అచంచలమైన అంకిత భావాన్ని తెలియ చేస్తుందన్నారు ప్రిన్స్ మహేష్ బాబు. ఇది తెలుగు సినిమా రంగానికి గౌరవంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు విక్టరీ వెంకటేశ్. మీరు చేసిన కృషి తరతరాలకు స్పూర్తి కలిగిస్తుందన్నారు మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు. అద్భుతమైన నటుడు, అంతకు మించిన సేవకుడు బాలకృష్ణకు పద్మం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు దర్శకుడు బాబీ. ఆయన ఎల్లప్పటికీ అన్ స్టాపబుల్ ఈ అవార్డుతో మరింత ఎత్తుకు ఎదిగారని అన్నారు నిర్మాత నాగ వంశీ.
Also Read : Victory Venkatesh SKVN : దూసుకు పోతున్న వెంకీ మామ