ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. ముంబై సెన్సార్ బోర్డులో అవినీతి , అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. విశాల్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
విశాల్ చేసిన ఆరోపణలు వాస్తవమా కాదా అన్న దానిపై విచారణ చేపట్టేందుకు ఆదేశించామని సర్కార్ స్పష్టం చేసింది. ప్రస్తుతం నటుడు నటించిన మార్క్ ఆంటోనీ విడుదలై భారీ సక్సెస్ మూటగట్టుకుంది. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు.
ఈ తరుణంలో సినిమాకు సంబంధించి సర్టిఫికెట్ రావడానికి ముంబై సెన్సార్ బోర్డుకు తాను డబ్బులు ఇచ్చానంటూ సంచలన ఆరోపణలు చేశారు నటుడు విశాల్. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.
ఇందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ కు తమిళ రాష్ట్రంతో ప్రతి రోజూ పేచీ కొనసాగుతోంది. ఈ తరుణంలో నువ్వా నేనా అన్న రీతిలో పాలిటిక్స్ నడుస్తున్నాయి.
ఇదే క్రమంలో నటుడు విశాల్ చేసిన విమర్శలు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. దీంతో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముంబై సెన్సార్ బోర్డు పై విచారణకు ఆదేశించడం విశేషం.