Sonu Sood : విలక్షణ నటుడు, ప్రతి నాయకుడిగా పేరు పొందిన సోనూ సూద్ తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించేందుకు సూద్ చారిటీ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎందరినో ఆదుకుంటున్నారు. కష్టాలలో ఉన్న వారికి భరోసా కల్పిస్తున్నారు. చాలా మంది పిల్లలను ఉన్నత చదువులు చదివేందుకు సహకరిస్తున్నారు. విరాళాల రూపేణా అందిస్తున్నారు. వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రయత్నం చేస్తున్నారు.
Sonu Sood Helps…
సోనూ సూద్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. చారిటీ ఫౌండేషన్ తరపున ప్రజల కోసం నాలుగు అంబులెన్సు లను విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, తాళాలను సీఎంకు అందజేశారు.
ఈ సందర్బంగా తన ఉదారతను చాటుకున్న నటుడు సోనూ సూద్ ను ప్రత్యేకంగా అభినందించారు. సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య చికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి కావడంపై ధన్యవాదాలు తెలిపారు.
Also Read : AR Rahman Sensational Song : ఛావా సాంగ్ వైరల్ అల్లా రఖా సెన్సేషన్