Shobhana : మోడీ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను వెల్లడించింది. దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాల్లో నలుగురి సినీ ప్రముఖులను ఎంపిక చేసింది. ఏపీ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళనాడు నుంచి అజిత్ కుమార్, కేరళకు చెందిన విశిష్ట నటిగా గుర్తింపు పొందిన శోభన(Shobhana), కర్ణాటక నుంచి అనంత నాగ్ ను పురస్కారాలను ప్రకటించింది.
Shobhana Padma Award..
విచిత్రం ఏమిటంటే నాట్యంలో తనకంటూ ప్రత్యేకతను కలిగిన నటి శోభన బాలయ్య బాబుతో కలిసి మువ్వ గోపాలుడు, నారీ నారీ నడుమ మురారి సినిమాలలో నటించడం విశేషం. ఇద్దరికీ పద్మాలు దక్కడం విస్తు పోయేలా చేసింది.
నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా తనకు అవార్డు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది తెలుగు చలన చిత్ర పరిశ్రమ. మరో వైపు ఎంతో ఎత్తుకు ఎదిగినా ఎలాంటి భేషజాలకు పోకుండా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడే అజిత్ కుమార్ కు కూడా పద్మం దక్కింది.
ఇక శోభన చాలా సినిమాలలో నటించారు. చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన అసాధారణ ప్రతిభా పాటవాలతో ఆకట్టుకున్నారు. ఆమెకు పద్మం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్, సినీ ప్రముఖులు.
Also Read : Kiccha Sudeep Reject : ప్రభుత్వ అవార్డును తిరస్కరించిన సుదీప్