Shivaraj Kumar : ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న పెద్ది మూవీ షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్(Shivaraj Kumar) , భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, గ్లింప్స్ కు పెద్ద ఎత్తున స్పందన లభించింది. చెర్రీ స్టామినాకు తగినట్టుగా దీనిని చిత్రీకరిస్తున్నారు దర్శకుడు.
Shivaraj Kumar Comment about Peddi Movie
ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో రూపు దిద్దుకుంటోంది. ఈ కీలకమైన ప్రాజెక్టులో భాగమైన శివ రాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్ సందర్బంగా పెద్ది మూవీలో తాను భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. పూర్తిగా సెట్స్ లో ఎంజాయ్ చేశానని చెప్పాడు. ప్రత్యేకించి దర్శకుడికి ఉన్న టేస్ట్ బాగుందన్నాడు. కథ, చిత్రీకరణ తనను ఆకట్టుకునేలా చేసిందన్నారు శివ రాజ్ కుమార్.
చివరి క్షణాల్లో రామ్ చరణ్ తీసిన వినూత్న క్రికెట్‌ను కలిగి ఉన్న ఈ గ్లింప్స్ వైరల్‌గా మారింది, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో భారీ సంచలనాన్ని రేకెత్తించింది. శక్తివంతమైన విజువల్స్ , ప్రత్యేకమైన ప్రెజెంటేషన్ ఈ చిత్రాన్ని ఇప్పటికే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిపాయి. రామ్ చరణ్ , జాన్వీ, బుచ్చిబాబుతో చాటింగ్ మరింత ఆహ్లాదాన్ని కలిగించిందన్నారు శివ రాజ్ కుమార్. ఈ సినిమా సందర్బంగా కొందరు స్నేహితులు దొరికారని, దీంతో పాటు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు.
Also Read : SS Thaman Shocking Comment :డీఎస్పీని తీసుకోవడంపై థమన్ కామెంట్స్