Posani Krishna Murali : ప్రముఖ నటుడు, మాజీ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. ఏపీలోని రాయచోటి పోలీసులు ఆయనకు ఝలక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని గచ్చబౌలిలో తన నివాసంలో ఉన్న సమయంలో తలుపులు తట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ ప్రశ్నించారు పోసాని కృష్ణ మురళి.
Posani Krishna Murali Got Arrested
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలతో పాటు మెగా ఫ్యామిలీపై నోరు పారేసుకున్నారు. దీంతో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లపై రాష్ట్రంలోని పలు చోట్ల ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు రాయచోటి పరిధిలో పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) చంద్రబాబు, పవన్ పై అనుచిత కామెంట్స్ చేశారని, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
కానీ ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అధికారానికి దూరం కావడంతో ఇప్పటికే వైసీపీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులకు చుక్కలు చూపిస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. కస్టడీకి తీసుకున్నారు. తాజాగా పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
Also Read : Prashant Kishor Shocking :దళపతిని సీఎం చేసేంత దాకా నిద్రపోను