Actor Navdeep : డ్ర‌గ్స్ కేసులో న‌వ‌దీప్ కు నోటీస్

23న హాజ‌రు కావాల‌ని ఆదేశం

హైద‌రాబాద్ – టాలీవుడ్ లో మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించింది డ్ర‌గ్స్ కేసు. తాజాగా న‌గ‌రానికి చెందిన నార్కోటిక్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల‌లో పెద్ద ఎత్తున డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయి. ఇందులో ముగ్గురు త‌ప్పించుకున్నారు. వారిలో తెలుగు సినిమా రంగానికి చెందిన ఓ నిర్మాత‌తో పాటు మోడ‌ల్, న‌టుడు న‌వ‌దీప్.

దాడి చేసిన ప‌బ్ ను నిర్వ‌హిస్తున్న‌ది న‌టుడు న‌వ‌దీప్ అని హైద‌రాబాద్ న‌గ‌ర క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ కేసులో న‌వ‌దీప్ కూడా ఉన్నార‌ని, పారిపోయారంటూ చెప్పారు. దీనిపై నోరు విప్పాడు న‌టుడు న‌వ‌దీప్ . తాను ఎక్క‌డికీ పారి పోలేద‌ని, సిటీలో ఉన్నాన‌నంటూ స్ప‌ష్టం చేశారు.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు పోలీసులు. త‌న‌కు కూడా ప్ర‌మేయం ఉంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ముందే గ‌మ‌నించిన న‌టుడు న‌వ‌దీప్ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌ను ముంద‌స్తు అరెస్ట్ చేయొద్దంటూ పిటిష‌న్ లో కోరారు.

దీనిపై విచారించిన హైకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసింది. న‌టుడికి షాక్ ఇచ్చింది. హైద‌రాబాద్ పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌వచ్చంటూ స్ప‌ష్టం చేసింది. అయితే అరెస్ట్ మాత్రం చేయొద్దంటూ తీర్పు చెప్పింది. దీంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబ‌ర్ 23న శనివారం రావాల‌ని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com