హైదరాబాద్ – మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మంగళవారం టాలీవుడ్ హీరో నవదీప్ హైదరాబాద్ నార్కోటిక్ డ్రగ్స్ ఆఫీసుకు హాజరయ్యాడు. విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గతంలో 2017లో ఇదే నటుడు నవదీప్ విచారణకు హాజరు కావడం విశేషం.
మనోడి ఆధ్వర్యంలో పబ్ నడుస్తోంది. ఇందులో డ్రగ్స్ వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల సిటీ నార్కో డ్రగ్స్ అధికారుల బృందం మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీ ఎత్తున డ్రగ్స్ , కొకైన్ లాంటి పదార్థాలు పట్టుబడ్డాయి.
విచారణలో ఈ పబ్ నవదీప్ దని తేలింది. ఇదే విషయాన్ని సిటీ పోలీస్ కమిషనర్ ఏవీ ఆనంద్ వెల్లడించారు. నిందితుడని పేర్కొన్నారు. ఇదే కేసులో సినీ నిర్మాత, ఓ మోడల్ కూడా పాత్ర ఉందని స్పష్టం చేశారు. అయితే వారిద్దరూ ఇంకా పరారీలో ఉండడం విశేషం.
మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ కూడా ఉన్నట్లు చెప్పారు సీపీ. బేబీ సినిమా వాళ్లకు కూడా నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. సినీ నిర్మాత సుశాంత్ రెడ్డి కూడా ఉండడం విశేషం. ఇదిలా ఉండగా పట్టుకున్న వాటిలో 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్ , 24 ఎక్టసీ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు సీపీ.
కాగా ఈ కేసుకు సంబంధించి నవదీప్ కోర్టును ఆశ్రయించాడు. తనను అరెస్ట్ చేయవద్దంటూ. కోర్టు విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో 10న విచారణకు హాజరయ్యాడు నవదీప్.