Meenakshi : మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన లవ్లీ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi) హాట్ టాపిక్ గా మారారు. తను ప్రస్తుతం దుబాయ్ లో ఉంది. ఎడారి ప్రాంతాలను సందర్శించింది. సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ నటి. ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్బంగా విడుదలైన తను నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం దుమ్ము రేపింది.
Meenakshi Trending..
ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. కాసుల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్ కు దగ్గరగా ఉందని సమాచారం. ఇప్పటికే మూవీ మేకర్స్ అధికారికంగా తమ సినిమా కలెక్షన్ల గురించి కీలక ప్రకటన చేశారు. రూ. 230 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. ఇందులో కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది మీనాక్షి చౌదరి. మరో పాత్రల్లో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ నటించారు.
వెంకీకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి నటించగా భార్యగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. ప్రత్యేకించి బా..అంటూ ఐశ్వర్య పలికిన డైలాగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇక పలు సినిమాలలో బిజీగా ఉంది మీనాక్షి చౌదరి. ఓ వైపు సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ లలో పాల్గొంటూనే మరో వైపు దుబాయ్ అందాలను వీక్షిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Also Read : Hero Chaitanya Thandel : గుండెల్ని మీటనున్న ‘తండేల్’