Mammootty : మలయాళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టికి క్యాన్సర్ వ్యాధి సోకిందని జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తమని తన టీం వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇదంతా కొందరు కావాలని చేస్తున్న ప్రచారంగా కొట్టి పారేసింది. ఆయన హాయిగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. మమ్ముట్టి(Mammootty) రంజాన్ ఉపవాసం కోసం షూటింగ్ కు రావడం లేదని స్పష్టం చేసింది బృందం.
Mammootty Comment
రోజాలో ఉండడం వల్ల కొంత సమయం కావాలని మమ్ముట్టి కోరారని, ఇందుకు చిత్ర దర్శక, నిర్మాతలు అనుమతి ఇచ్చారని తెలిపింది. దీంతో షూటింగ్ షెడ్యూల్ లో మార్పు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. విరామం తర్వాత మమ్ముట్టి మోహన్ లాల్ తో మహేష్ నారాయణ్ తీసే సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలిపింది. ఇలాంటి వార్తలు రాసే ముందు వివరణ తీసుకోక పోవడం దారుణమని పేర్కొంది.
ఇదిలా ఉండగా మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి చేస్తున్న రాబోయే చిత్రానికి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్ అని పేరు పెట్టారు. ఇందులో లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరు పొందిన తమిళ సినీ నటి నయనతార కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. గత నెలలో నిర్మాణ సంస్థ ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ యూట్యూబ్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ కూడా చేసింది.
కాగా ఇద్దరు దిగ్గజ నటులు గతంలో అవిదతేపోలే ఇవిదేయుమ్, అదియోజుక్కుకల్, కరింపిన్పూవినక్కరే, మజా పెయ్యున్ను మద్దలం కొట్టును, అధ్వాయతం, విష్ణులోకం , నం.20 మద్రాస్ మెయిల్ వంటి చిత్రాలలో నటించారు.
Also Read : 2028లో అల్లు అర్జున్ పుష్ప3 రిలీజ్