Actor Jayaprada : మాజీ పార్లమెంటేరియన్, సీనియర్ సినీ నటి జయప్రద మరోసారి షాక్‌కు గురయ్యారు. ఆమె గతంలో ఈఎస్‌ఐ సంబంధిత కేసులో నిర్బంధించబడి, మరో కేసులో ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది. నటి, రాజకీయ నాయకురాలు జయప్రదను అరెస్టు చేసి ఫిబ్రవరి 27న కోర్టు ముందు హాజరుపరచాలని రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు పోలీసులను ఆదేశించింది. జయప్రదపై ఏడవ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత కూడా ఆమె హాజరుకాలేదని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమర్‌నాథ్ తివారీ తెలిపారు. ఆమెకు నాన్ బయిలెబుల్ వారెంట్ జారీ అయింది. జయప్రదను(Jayaprada) అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఉత్తర్వులు ఇప్పుడు వేగంగా వ్యాపిస్తున్నాయి. పుసుక్కుని పోలీసులకు దొరికితే జైలుకు వెళ్లక తప్పదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కోర్టు ఆదేశాలను జయప్రద ధిక్కరించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Actor Jayaprada Arrest Warrant
మరి వాస్తవం ఏమిటంటే…! జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై వారిపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు రాంపూర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, నిర్ణీత తేదీల్లో జయప్రద కోర్టుకు హాజరుకాకపోవడంతో, ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆమె అరెస్టుకు ఏడు వారెంట్లు జారీ చేసినప్పటికీ ఆమెను అరెస్టు చేయలేదని ప్రభుత్వ లాయర్లు వాదించడంతో పోలీసులపై కోర్టు సీరియస్ గా స్పందించింది. ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీని ఆదేశించారు. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
Also Read : Just a Minute : ప్రేమికుల రోజున ‘జస్ట్ ఎ మినిట్’ సినిమా నుంచి కొత్త మెలోడీ సాంగ్