Hariprriya : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్లేస్ సంపాదించుకున్న నటి హరిప్రియ(Hariprriya). పలు సినిమాలలో నటించింది. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చింది. తను ప్రముఖ నటుడు వశిష్ట సింహాను పెళ్లి చేసుకుంది. తాజాగా హరిప్రియ నెట్టింట్లో వైరల్ గా మారింది. త్వరలోనే తను ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతోంది. ఇందుకు సంబంధించి భర్త వశిష్ట ప్రత్యేకంగా తన భార్య జీవితంలో మరిచి పోలేని రీతిలో గ్రాండ్ గా సీమంతం ఏర్పాటు చేశాడు.
Beauty Hariprriya…
ఇరువురు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు , తెలుగు, కన్నడ సినీ రంగాలకు చెందిన ప్రముఖ సినీ నటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హీరోయిన్ హరిప్రియను ఆశీర్వదించారు. పండంటి బిడ్డకు ప్రాణం పోయాలంటూ దీవించారు. అక్షింతలు చల్లారు. జీవితాంతం మీ ఇద్దరూ హాయిగా, సంతోషంగా ఉండాలని కోరారు.
ఇదిలా ఉండగా హరి ప్రియ సీమంతానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో. తనకు వశిష్ట సింహా భర్తగా లభించడం దేవుడు ఇచ్చిన వరం అంటూ కితాబు ఇచ్చింది నటి హరిప్రియ.
Also Read : Hero Vijay Wishes : దళపతి విజయ్ పొంగల్ శుభాకాంక్షలు