Anshu : మజాకా సినిమా టీజర్ రిలీజ్ సందర్బంగా దర్శకుడు త్రినాథరావు చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ప్రత్యేకించి చాలా కాలం గ్యాప్ తర్వాత నటి అన్షు అంబానీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ ద్వారా. ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ అన్షు అంబానీ(Anshu) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతే కాకుండా ఆమె శరీర ఆకృతి గురించి కామెంట్స్ చేశాడు.
Anshu Ambani Comments
తన సైజులు (పాలిండ్లు) చాలా చిన్నగా ఉన్నాయని , వాటిని పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించాడు. తెలుగు ప్రేక్షకులు వాటిని ఎక్కువగా ఇష్ట పడతారని, అందుకే అలా అనాల్సి వచ్చిందని అన్నాడు. దీంతో డైరెక్టర్ త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. క్షమాపణ చెప్పి తీరాలని పట్టుపట్టారు. సోషల్ మీడియాలో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే సమయంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద సీరియస్ అయ్యారు. త్రినాథరావు చేసిన కామెంట్స్ ఆధారంగా సుమోటోగా తీసుకుంటామని, నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమం వివాదాస్పదంగా మారడంతో నటి అన్షు అంబానీ స్పందించింది. డైరెక్టర్ త్రినాథరావును వెనకేసుకు వచ్చింది. తను చాలా మంచి వాడని, చాలా కాలం గ్యాప్ తర్వాత తనను ఏరికోరి ఎంపిక చేశారని, మజాకా సినిమాలో తనకు గొప్ప పాత్ర వచ్చిందని పేర్కొంది. ఇంతటితో ఆయనను వదిలేయాలని కోరింది.
Also Read : Beauty Hariprriya : గ్రాండ్ గా నటి హరిప్రియ సీమంతం